BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 12:20 pm
Posted by : BOYA SWAMY

తెలంగాణను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
Boya Swamy Chityala Mandal
27 Sep, 2026 - 12:20 PM
25 వీక్షణలు

తెలంగాణను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 27, Ntoday News: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ, విదేశాల నుంచి రాష్ట్రాన్ని సందర్శిస్తున్న పర్యాటకులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, జలపాతాలు, అటవీ ప్రాంతాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చెరువులు, జానపద కళలు, పండుగలు తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం పేర్కొన్నారు. రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారం, హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు తదితర పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

తెలంగాణ టూరిజం పాలసీ 2025–30 ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, కొత్త పర్యాటక ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్కులు, వే-సైడ్ అమినిటీస్, ఎకో టూరిజం వంటి రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజంతో పాటు వారసత్వ పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

పర్యాటకులకు మెరుగైన వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని సీఎం తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

పర్యాటక రంగ అభివృద్ధిలో స్థానిక ప్రజలు, పర్యాటక సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, కళాకారులు, హస్తకళాకారులు, యువత భాగస్వామ్యం కీలకమని సీఎం అన్నారు. తెలంగాణ వారసత్వాన్ని కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, స్థానిక సంస్కృతికి గౌరవం ఇస్తూ స్థిరమైన పర్యాటక అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణకు వచ్చే ప్రతి పర్యాటకుడికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటాలని సీఎం కోరారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు.