BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Test 4
Date of Publish : 12 November 2026, 04:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడులో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్డీఓ ఏ. కుమార్ ఆపన్నహస్తం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 04:22 PM
5 వీక్షణలు

సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి తక్షణ సాయం.. బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ ఏ. కొండూరు, నవంబర్ 12: అగ్నిప్రమాదంలో నివాస గృహం పూర్తిగా దగ్ధమై కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిన బాధిత కుటుంబానికి తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ అండగా నిలిచారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మేకల సురేష్ తండ్రి జాన్ కుటుంబం నవంబర్ 11న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు నివాస గృహం మొత్తాన్ని చుట్టుముట్టడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వంట సామగ్రి, దుస్తులు, మంచాలు, విద్యుత్ పరికరాలు, ఇతర గృహోపకరణాలు సహా సమస్త వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కళ్లముందే ఇల్లు, ఇంటి సామగ్రి బూడిద కావడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. కనీసం నిత్యావసర వస్తువులు కూడా మిగలకపోవడంతో కుటుంబం కట్టుబట్టలతోనే నిరాశ్రయులుగా మిగిలింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్ వెంటనే స్పందించి గురువారం బాధిత కుటుంబానికి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు. అగ్నిప్రమాదంతో సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి తక్షణ అవసరాల కోసం సాయం అందించి, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామనే భరోసా కల్పించారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం అధికారుల బాధ్యత మాత్రమే కాకుండా మానవతా ధర్మమని ఈ సందర్భంగా ఆయన అందించిన సహాయం చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఏ. కొండూరు మండల డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.