www.ntodaynews.com
RTI బోర్డులు ఎక్కడ? ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యం.!
తెలంగాణ
గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు RTI బోర్డుల లోపాలు- ఆర్టీఐ సతీష్
NTODAY NEWS: ఆర్టీఐ రక్షక్
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు RTI బోర్డులు తప్పనిసరి – సమాచార హక్కు చట్టం ఉల్లంఘనలపై చర్యలు అవసరం - ఆర్టీఐ సతీష్ ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు
సమాచార హక్కు చట్టం – 2005 (Right to Information Act, 2005) ప్రకారం
గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో RTI బోర్డులు స్పష్టంగా, అప్డేట్ చేసి ఉంచడం తప్పనిసరి అని చట్టం స్పష్టంగా పేర్కొంటోందని ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ అన్నారు. అయితే, అనేక గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో RTI బోర్డులు లేకపోవడం, పాత సమాచారం ఉంచడం, PIO / FAA (మొదటి అప్పిలేట్ అధికారుల) వివరాలు ఇవ్వకపోవడం, చదవడానికి వీలులేని విధంగా బోర్డులు చెరిగిపోవడం వంటి ఉల్లంఘనలు ప్రతి కార్యాలయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సమాచార హక్కు చట్టం లోని Section 4 (1)(b) ఏమంటుంది?
Section 4 (1)(b) – RTI Act, 2005
ప్రతి ప్రభుత్వ అధికారి (Public Authority): తన విధులు, అధికారాలు
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) పేరు, హోదా ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ (FAA) వివరాలు RTI దరఖాస్తు విధానం
ప్రజలకు సులభంగా కనిపించే విధంగా ప్రదర్శించాలి. RTI బోర్డులు పెట్టడం ఈ సెక్షన్ కింద తప్పనిసరి అధికారుల బాధ్యత. “ప్రజలు అడగకముందే సమాచారం స్వచ్ఛందంగా (Suo Motu) గా అందించాలి” RTI బోర్డు పెట్టకపోవడం అంటే స్వచ్ఛంద సమాచార వెల్లడి చేయకపోవడమే. RTI బోర్డు లేకపోవడం లేదా పాత సమాచారం ఉంచడం అంటే
ప్రజల మౌలిక హక్కుల ఉల్లంఘన
Constructive Denial of Information
పరిపాలనా నిర్లక్ష్యం (Administrative Lapse) ఇది చట్టపరంగా ఫిర్యాదు చేయదగిన అంశం.
ఏ ఏ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి?
RTI బోర్డులు తప్పనిసరిగా ఉండాల్సిన కార్యాలయాలు:
గ్రామ పంచాయతీ కార్యాలయాలు,
మండల పరిషత్ (MPDO) కార్యాలయాలు,
మున్సిపాలిటీ / కార్పొరేషన్ కార్యాలయాలు,
జిల్లా కలెక్టర్ కార్యాలయం,
అన్ని శాఖల జిల్లా, రాష్ట్ర కార్యాలయాలు,
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, PSUలు. ప్రస్తుత PIO / FAA (అప్పిలేట్ అధికారుల) వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి RTI Act Section 4 ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి చట్టం అమలుకు అన్ని జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలి.
ప్రభుత్వ కార్యాలయంలో RTI బోర్డు లేకపోతే లేదా తప్పుగా ఉంటే:
RTI Act Section 4 (1)(b) కింద
- RTI అప్లికేషన్
- కలెక్టర్‌కు ఫిర్యాదు
- స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు కంప్లైంట్
చేయవచ్చని చట్టం సూచిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని కార్యాలయాల్లో యూనిఫాంగా RTI బోర్డులు ఏర్పాటు చేయాలనీ ఆర్టీఐ రక్షక్ సంస్థ కోరుతుంది.
ఆర్టీఐ సతీష్
ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు
7989211956
Follow us on
Website
Facebook
Instagram
YouTube