BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కుషాయిగూడలో మహిళ ఆత్మహత్య

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 12:08 PM
10 వీక్షణలు

హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాప్రాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న స్వాతి మహాజన్ (35) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

స్వాతి మహాజన్‌కు గోపాలకృష్ణ తులసీదాస్‌తో వివాహం కాగా, వీరికి స్వరూప్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. గతంలో యూకేలో నివసించిన ఈ దంపతులు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడినట్లు సమాచారం. గోపాలకృష్ణ ఉద్యోగం చేస్తుండగా, స్వాతి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వాతి కొంతకాలంగా మనోవేదనకు గురైనట్లు ప్రాథమిక సమాచారం. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లివింగ్ హాల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై భర్త గోపాలకృష్ణ పోలీసులకు సమాచారం అందించడంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.