మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
అన్నారం షరీఫ్ సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్ గౌడ్
అన్నారం షరీఫ్ లో నూతన గ్రామైక్య సంఘ భవనం ప్రారంభంతోపాటు మరో నూతన భవనంకు ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తో కలిసి భూమి పూజ నిర్వహణ
మహబూబాబాద్ 'అక్టోబర్ 28
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని అన్నారం షరీఫ్ లో 10 లక్షల వ్యయం తో నిర్మాణం చేసిన ఐకెపి గ్రామైక్య సంఘ భవనాన్ని స్థానిక ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్, తో కలిసి స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశానుసారం ప్రారంభించడంతోపాటు మరో నూతన భవనానికి భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వడ్డీ లేని రుణాలను అందించడంతోపాటు వారికి కుటీర పరిశ్రమల కల్పనకు ప్రత్యేక రుణాలు అందిస్తుందన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలకు కూరగాయల సాగు, వంటి వాటిని ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామంలో మహిళా సంఘాల భవనా వల్ల వారికి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుటకు ఎంతో దోహదం చేస్తాయన్నారు. నెలవారి సభలు, తదితర సమస్యలను పరిష్కరించుటకు వేదికగా భవనాలు పనిచేస్తాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను అన్నారు. గ్రామంలో అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ప్రజలు సహకరించాలని కోరారు. . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొడుగు ఏకాంత సారయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి పిఎసిఎస్ డైరెక్టర్ మోటపోతుల సుదర్శనం, ఐకెపి ఏపిఎం రాజీవ్, సీసీ సుధాకర్ , పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజు, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు భాష బోయిన రామకృష్ణ, మంజంపల్లి నాగరాజు, గాడి పెళ్లి రాజబాబు, బత్తిని జలంధర్, రాపోలు అనిత రవీందర్, పస్తం రాధిక సుధాకర్ , దొంత మాల పవన్ కళ్యాణ్ , వివోఏలు శైలజ, సంధ్య, స్రవంతి వివో అధ్యక్షురాలు అమ్మాజీ ప్రవళిక స్రవంతి గ్రామ పుర ప్రముఖులు ఈరగాని సాంబయ్య , రామస్వామి, కృష్ణమోహన్, జనగాం లక్ష్మణ్ ,రామ్మూర్తి, గ్రామపంచాయతీ సిబ్బంది కారోబార్ గుండ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.