BREAKING
thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● Yadadri Bhuvanagiri: విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● నవంబర్ 15న నల్లగొండలో ఏఐకేఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలి thumb ● జనరల్ బాడీ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ thumb ● ఫ్లోరైడ్ సమస్యకు డిండి ఎత్తిపోతల పథకమే శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి thumb ● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● Mahabubabad : అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామకృష్ణకు రూ.3 లక్షల ఎల్‌ఓసీ సాయం thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● Yadadri Bhuvanagiri: విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● నవంబర్ 15న నల్లగొండలో ఏఐకేఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలి thumb ● జనరల్ బాడీ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ thumb ● ఫ్లోరైడ్ సమస్యకు డిండి ఎత్తిపోతల పథకమే శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి thumb ● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● Mahabubabad : అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామకృష్ణకు రూ.3 లక్షల ఎల్‌ఓసీ సాయం thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్
మంచి మాట
Date of Publish : 02 November 2026, 06:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Warangal: యువశక్తే దేశానికి వెన్నెముక: గంట రవికుమార్

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 06:21 PM
14 వీక్షణలు

వరంగల్ జిల్లా బీజేవైఎం కార్యవర్గ సమావేశంలో యువతకు పిలుపు

వరంగల్, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి యువతకు మాత్రమే ఉందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో సోమవారం ధర్మారం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జి జలగం రంజిత్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యువతకు బీజేపీ ప్రాధాన్యత

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. ఏ దేశానికైనా యువతే వెన్నెముక అని, వారి శక్తి, ఆలోచనలు, కృషిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. యువతను ప్రోత్సహించడంతో పాటు వారి రాజకీయ ఎదుగుదలకు బీజేపీ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు.

యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని గంట రవికుమార్ విమర్శించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.

ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని బీజేవైఎం నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల కోసం యువమోర్చా ముందుండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో విద్యా, ఉద్యోగ సమస్యలపై ధర్నాలు నిర్వహించేలా పలు తీర్మానాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

పలువురు నాయకుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల శ్రవణ్, రాపాక ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అచ్చ దయాకర్, ఆడెపు రవిరాం, బీజేవైఎం పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.