BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:25 pm
Posted by : KOLA MAHESH

నవంబర్ 15న నల్లగొండలో ఏఐకేఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 08:25 PM
15 వీక్షణలు

రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: మేక అశోక్‌రెడ్డి, జల్లెల పెంటయ్య

రామన్నపేట, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా మొదటి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

రెడ్ బెలూన్లు ఎగురవేసి ప్రచారం

జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో రెడ్ బెలూన్లను ఎగురవేసి సభను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చించేందుకు ఈ మహాసభలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. రైతుల హక్కులు, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

రైతాంగ సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చ

పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల రుణభారం, సాగు ఖర్చుల పెరుగుదలతో పాటు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నట్లు నాయకులు వెల్లడించారు. రైతాంగ ఐక్యతను చాటుతూ నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

పలువురు నాయకుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం నాయకులు కందుల హనుమంతు, గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, నీల అయిలయ్య, అప్పం సురేందర్, శానగొండ రాము, మార్త భూపాల్‌రెడ్డి, జల్లెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.