జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం
సురవరం ఎంపీటీసీ సెగ్మెంట్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా కొల్ల అప్పలనాయుడు ప్రచారం
సంతకవిటి, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):
విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో జోరువర్షం కురుస్తున్నప్పటికీ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. సోమవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు సురవరం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
సంతకవిటి మండల ఎంపీపీ అభ్యర్థి కొల్ల యశస్సు, జడ్పీటీసీ అభ్యర్థి వల్లూరు సంగీతతో పాటు మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కొల్ల అప్పలనాయుడు ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా కూటమి తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
వర్షంలోనూ పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో సంతకవిటి మండల టీడీపీ అధ్యక్షుడు గట్టి భాను, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్, మండల సీనియర్ నాయకుడు గట్టి రఘుబాబుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.