BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:22 pm
Posted by : KOLA MAHESH

ఫ్లోరైడ్ సమస్యకు డిండి ఎత్తిపోతల పథకమే శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 08:22 PM
72 వీక్షణలు

మునుగోడులో ఎల్‌నినో ప్రభావం, కరువు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం

మునుగోడు, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు డిండి ఎత్తిపోతల పథకం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకోవడంతో పాటు, భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే చెరువులు, చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయాలని సూచించారు.

వికసిత్ భారత్ – జీ రామ్ జీ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నల్లగొండ ఆధ్వర్యంలో సోమవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నియోజకవర్గస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం, కరువు నివారణ చర్యలపై యాదాద్రి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు, మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల అధికారులు, గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.

డిండి ఎత్తిపోతల పథకంతోనే నీటి సమస్యకు పరిష్కారం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ సమస్యతో తీవ్రంగా ప్రభావితమైందని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి నీటి సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు డిండి ఎత్తిపోతల పథకం కీలకమని తెలిపారు.

గత ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లను పిలిచి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే అంశంపై స్పష్టత ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఏదుల రిజర్వాయర్‌ నీటిమట్టాల విషయంలో ఎదురైన సమస్యను కూడా పరిష్కరించుకున్నామని, నాగర్‌కర్నూల్‌, వనపర్తి ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజలను ఒప్పించి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మునుగోడు ఫ్లోరైడ్ సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

300 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

డిండి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు స్థానిక నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 300 చెరువులను గుర్తించి ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినప్పటికీ నిధులు మంజూరు కాలేదని అన్నారు.

వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నప్పటికీ, ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి స్థానిక నీటి వనరులను అభివృద్ధి చేసుకోవడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ, ఫ్లోరైడ్ ప్రభావిత మునుగోడు ప్రాంతంలోని చెరువుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు.

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి

ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గాయని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గ రైతులకు ఎక్కువ పరిహారం అందించేలా ప్రభుత్వానికి నివేదిక పంపించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. పంట నష్టపోయిన రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకోవాలని సూచించారు.

సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించడం లేదని, సేంద్రియ పద్ధతుల్లో వాణిజ్య పంటలు సాగు చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించినప్పుడే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

జిల్లాలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, దీని అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా ఇప్పటి నుంచే చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

తాను మంత్రి లేదా ముఖ్యమంత్రిని కాకపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, అయితే తన ప్రయత్నాలకు తగిన స్థాయిలో నిధులు రావడం లేదని వ్యాఖ్యానించారు. రైతులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల హాజరు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యాదాద్రి, నల్లగొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మునుగోడు నియోజకవర్గంలోని మండలాల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.