BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:30 pm
Posted by : KOLA MAHESH

Yadadri Bhuvanagiri: విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 08:30 PM
12 వీక్షణలు

పాఠశాలలు, కళాశాలల వేళలకు అనుగుణంగా బస్సుల సమయాలు మార్చాలి: కొడారి వెంకటేష్

వలిగొండ, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల పని వేళలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకుడు కొడారి వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

బస్సుల సమయాల మార్పుతో విద్యార్థులకు ఇబ్బందులు

ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరే బస్సు సైదాపూర్, మాసాయిపేట, గౌరాయపల్లి, రఘునాథపురం మీదుగా కాచారం, కంఠంగూడెం చేరుకుని ఉదయం 9 గంటల వరకు ఆలేరుకు చేరుకునేదని తెలిపారు. దీంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సమయానికి వెళ్లేవారని పేర్కొన్నారు.

అయితే యాదగిరిగుట్ట డిపో అధికారులు బస్సుల సమయాలను మార్చడంతో ప్రస్తుతం ఉదయం 9 గంటలకు బస్సు బయలుదేరుతోందని, దీంతో విద్యార్థులు విద్యాసంస్థలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డిపో మేనేజర్‌కు పలుమార్లు విజ్ఞప్తి

బస్సుల సమయాలను పాఠశాలలు, కళాశాలల పని వేళలకు అనుగుణంగా మార్చాలని యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేదని వెంకటేష్ తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

వినతిపత్రంపై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌తో మాట్లాడి విద్యార్థుల విద్యాసంస్థల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా సంబంధిత అధికారులకు సూచిస్తామని హామీ ఇచ్చినట్లు వెంకటేష్ తెలిపారు.

విద్యార్థుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో విద్యార్థులు కే. హారిక, ఐ. చరిత, ఆర్. వాణి, ఎస్. శ్రీవాణి, ఎస్. సోనీ, బి. ప్రవల్లిక, జి. ఈక్షిత, కే. సాత్విక, బి. రిషిక తదితరులు పాల్గొన్నారు.