ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హనుమకొండ జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు
హనుమకొండ, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల జాబితా ప్రక్రియపై సమీక్ష
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
హనుమకొండ కలెక్టరేట్ నుంచి అధికారుల హాజరు
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.