BREAKING
జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం
www.ntodaynews.com

నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు

తెలంగాణ
18 May, 2025 - 08:28 AM
156 వీక్షణలు
నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సివస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రైవేటు ట్యాంకర్లను తెప్పించుకుని ఇతర అవసరాలను తీర్చుకుంటున్నామని తెలిపారు. ట్యాంకర్ నుండి నీరు తెప్పించుకుంటున్నారంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు సార్లు మిషన్ భగీరథ అధికారులకు పంచాయితీ కార్యదర్శికి తమ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కింద బస్తీలో సుమారు 60. కుటుంబాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవ డంతో తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. భగీరథ నీటిసరఫరా నిలిచిపోతే గ్రామ పంచాయితీ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉండగా గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకున్న పాపనా పోలేదు గత మూడు రోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రైవేటు ట్యాంకర్లు తెప్పించుకుని అవసరాలు తీర్చు కోవాల్సివస్తోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండ టంలేదు.సమస్య పరిష్కరించాల్సిన అధికారులు సమన్వయ లోపంతో సమస్య మరింత తీవ్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కింది బస్తీలో మూడు రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదని పలుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. బిందెడు నీటి కోసం పడరానిపాట్లు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తంచేశారు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు మిషన్ భగీరథ,పంచాయతీ అధికారుల సమన్వయలోపం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సత్వరమే పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube