BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 April 2026, 02:49 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

మాదిగల జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు కేటాయించాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Apr, 2026 - 02:49 PM
133 వీక్షణలు

మాదిగల జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు కేటాయించాలి: ఎమ్మార్పీఎస్ డిమాండ్

​కులగణనతో మాదిగల వాటా తేలిపోయింది: దుమాల గంగారాం మాదిగ

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయాన్ని సరిదిద్దాలి

​మందకృష్ణ మాదిగకు జాతీయ స్థాయిలో గుర్తింపు పట్ల హర్షం

​జగిత్యాల:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు జనాభా ప్రాతిపదికన 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) డిమాండ్ చేసింది. జగిత్యాల పట్టణ కేంద్రంలోని మాదిగ సంక్షేమ సంఘ భవనంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బొల్లారపు దివాకర్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎంఎస్పి (MSP) జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

​కులగణనతో వాస్తవాలు వెలుగులోకి..

​ఈ సందర్భంగా గంగారాం మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన గళాన్ని వినిపిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన కులగణన జాబితా ప్రకారం మాదిగల జనాభా సుమారు 36 లక్షల 57 వేలుగా (దాదాపు 11%) తేలిందని, ఇది మందకృష్ణ మాదిగ గతంలో చెప్పిన లెక్కలను నిజం చేసిందని అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ సమయంలో కేవలం 9 శాతం కేటాయించడం మాదిగలకు జరిగిన అన్యాయమని, శాస్త్రీయంగా కులగణన జరిగితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

​"కొంతమంది మేధావుల ముసుగులో ప్రభుత్వ మెప్పు కోసం 9 శాతం రిజర్వేషన్లను స్వాగతించి జాతికి ద్రోహం చేశారు. వారికి మాదిగ జాతిలో స్థానం లేదు."

​ప్రభుత్వానికి విన్నపం

​వర్గీకరణ చట్టం వచ్చే సమయంలోనే మందకృష్ణ మాదిగ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 11 శాతం వాటాపై విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. మాదిగల్లో ఉన్న పేదరికాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తక్షణమే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరారు.

​ప్రధానికి కృతజ్ఞతలు

​మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవాల అత్యున్నత కమిటీలో మందకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది మాదిగ జాతికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

ఈ ప్రెస్ మీట్‌లో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్ మాదిగ, సీనియర్ నాయకులు నక్క సతీష్ మాదిగ, కార్యదర్శి సంగెపు ముత్తు మాదిగ, నియోజకవర్గ కో-కన్వీనర్ పొడేటి సునీల్ మాదిగ, వెల్కటూర్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి మాదిగ, పట్టణ అధ్యక్షులు మారంపల్లి శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.