BREAKING
అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
www.ntodaynews.com

​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 02:14 PM
13 వీక్షణలు

హైదరాబాద్‌లో అరుదైన రెండు చిన్నారుల కేసుల్లో మెడికవర్ వైద్యుల విజయగాథ

హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన, క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో తమ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ఈ రెండు కేసులు అధిక నైపుణ్యం, ఖచ్చితత్వం, సమగ్ర ప్రణాళిక అవసరమైనవిగా వైద్యులు తెలిపారు.

మొదటి కేసులో 8 సంవత్సరాల బాలిక శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు నిర్వహించిన ఎంఆర్‌ఐ పరీక్షల్లో ఛాతి వెనుక భాగంలో 11.6 x 10.6 x 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితిని తొలగించకపోతే అది మరింత పెరిగి స్పైనల్ కార్డ్‌పై ఒత్తిడి పెంచి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రధాన రక్తనాళాలపై ప్రభావం చూపి ప్రాణాపాయం కలిగించే అవకాశమూ ఉందని చెప్పారు.

ఈ క్లిష్ట పరిస్థితిలో చీఫ్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి కందకురే, న్యూరో సర్జన్ డాక్టర్ అనీల్ కలిసి శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 500 గ్రాముల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం బాలికలో ఎటువంటి నర సంబంధిత లోపాలు లేకుండా స్థిరంగా కోలుకుంటోంది. బయాప్సీ నివేదిక ప్రకారం ఈ కణితి గ్యాంగ్లియోన్యూరోమా అనే కాన్సర్ కాని అరుదైన ట్యూమర్‌గా నిర్ధారణ అయింది.

ఇక రెండో కేసులో 4 సంవత్సరాల బాలుడు పుట్టినప్పటి నుంచే పెదాలు, గోర్లు నీలం రంగులో కనిపించడం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షల్లో అతనికి ‘సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ’ అనే అరుదైన గుండె లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె నాలుగు గదులుగా అభివృద్ధి చెందకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరైన స్థాయిలో చేరడం లేదని వెల్లడించారు.

ఈ పరిస్థితికి చికిత్స అందించకపోతే బాలుడిలో ఆక్సిజన్ స్థాయిలు మరింత తగ్గిపోవడం, ఎదుగుదల మందగించడం, తీవ్రమైన గుండె సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వైద్య బృందం క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం బాలుడి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, శారీరక సామర్థ్యం పెరిగినట్లు వైద్యులు తెలిపారు.

డాక్టర్ ప్రమోద్ రెడ్డి కందకురే మాట్లాడుతూ, ఈ రెండు కేసులు వైద్యపరంగా అత్యంత క్లిష్టమైనవని, సమగ్ర ప్రణాళిక, ఖచ్చితత్వం అవసరమని పేర్కొన్నారు. మొదటి కేసులో కణితి స్పైనల్ కార్డ్, ప్రధాన రక్తనాళమైన అయోర్టాకు అత్యంత సమీపంలో ఉండటంతో ప్రతి దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న పొరపాటు జరిగినా పక్షవాతం లేదా తీవ్రమైన రక్తస్రావం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశముందని వివరించారు.

అలాగే రెండో కేసులో ఉన్న సింగిల్ వెంట్రికల్ గుండె లోపం ప్రతి రోగిలో భిన్నంగా ఉండే సంక్లిష్ట సమస్యగా ఆయన పేర్కొన్నారు. ఈ రకమైన కేసుల్లో ఒకే విధమైన చికిత్స ఉండదని, రోగి శరీర నిర్మాణం, రక్తప్రసరణ విధానం ఆధారంగా వ్యక్తిగతంగా ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలిపారు. శస్త్రచికిత్స ద్వారా శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

న్యూరో సర్జన్ డాక్టర్ అనీల్ మాట్లాడుతూ, స్పైనల్ కాల్కు సమీపంలో ఉన్న కణితులను తొలగించే సమయంలో నరాలను కాపాడటం అత్యంత ముఖ్యమని అన్నారు. సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరమని వైద్యులు సూచించారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకపోవడం ద్వారా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నివారించవచ్చని పేర్కొన్నారు.