విద్యుత్ షాక్‌తో 12 ఏళ్ల బాలుడు మృతి
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల జిల్లా, రుద్రవరం:
రుద్రవరం మండలం ఆర్. కొత్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ, దస్తగిరి దంపతుల కుమారుడు బండారు గౌతమ్ (12) ఇంటి సమీపంలోని గొర్రెల షెడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గౌతమ్‌ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై రుద్రవరం ఎస్సై జయప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.