చిట్యాల మండలం లో స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం
18 సర్పంచ్ , 180 వార్డు మెంబర్లకు పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసిన అధికారులు
NTODAY NEWS : చిట్యాల
మొదటి విడత జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు చిట్యాల మండలంలో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. చిట్యాల మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు జరుగుతున్నాయి అందుకు అవసరమయ్యే ఏర్పాట్లను ఎన్నికల సిబ్బంది సిద్దం చేశారు. మొత్తం 18 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా 180 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రొసీడింగ్ ఆఫీసర్స్ గా 180 మంది విధులు నిర్వర్తిస్తుండగా అడిషనల్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ 256 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందిని స్టేజ్ 2 రిటర్నింగ్ పర్యవేక్షణ చేయనున్నారు. అంతేకాకుండా అలాగే ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు, 4 గురు జోనల్ అధికారులు 8 రూట్లుగా విభజించి ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. వీరు పోలింగ్ నిర్వహణ అనంతరం కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక, తదితర విధులు నిర్వర్తించనున్నారు. శాంతి భద్రతల కోసం పోలీస్ శాఖ ద్వారా 150 మంది పోలీస్ అధికారులను విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ లో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఎన్నికలకు సంబంధించిన సామగ్రి అయిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జిల్లా ఉప ఎన్నికల అధికారి ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని , గ్రామాలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. అనంతరం ల ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఆయా వార్డు మెంబర్లతో ఉపసర్పంచ్ కు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏదైనా అనివార్య కారణాల రిత్యా ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా వాయిదా పడితే తిరిగి మరుసటి రోజు ఉదయం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని ఆమె తెలిపారు.














