ప్రజల వద్దకు ప్రవీణ్
100 రోజులు – 100 గ్రామాలు ” కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మండలం తాడువాయి గ్రామంలో పర్యటించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
NTODAY NEWS: అచ్చంపేట
తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకునేందుకు తరలివచ్చిన గ్రామస్థులు. గ్రామంలోని ప్రజల సమస్యలను స్వయంగా విని తక్షణమే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. తమ పొలం ఆన్లైన్ సమస్య ఉందని వచ్చిన మహిళా రైతు సమస్యను దగ్గరుండి పరిష్కరించిన ఎమ్మెల్యే. ప్రజల సమస్యలను తీసుకుని వాటిని పరిష్కరించే విధంగా అధికారులు పని చేయాలన్న ఎమ్మెల్యే. ప్రజల సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధికి కార్యక్రమాలకు సహకరించాలన్న ఎమ్మెల్యే. కార్యక్రమంలో ఎండీవో, డిప్యూటీ తహశీల్దార్ , మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.














