ఆధార్ సర్వర్ మొరాయింపు.. విద్యార్థులు, వినియోగదారులకు ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థులకు ఆధార్ నవీకరణ శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం సర్వర్ మొరాయించడంతో ఆధార్ వివరాలను నవీకరించుకునేందుకు వచ్చిన విద్యార్థులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వర్ సమస్య కారణంగా ఆధార్ నవీకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి ఆధార్ సేవలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థులు, వినియోగదారులు కోరుతున్నారు.