BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 10:05 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 30 అంశాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Nov, 2026 - 10:05 PM
11 వీక్షణలు

అమరావతి:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన 30 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇవీ..

పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి

  • పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించే లక్ష్యంతో రూపొందించిన ‘ఏపీ ఎంఎస్‌ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు–2026’కు ఆమోదం తెలిపింది.

  • సీఐఐ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థల ద్వారా సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పేర్కొంది.

  • పెనుగొండలో రూ.19 వేల కోట్ల పెట్టుబడితో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

  • శ్రీకాకుళం జిల్లాలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

అమరావతి నిర్మాణం, మౌలిక వసతులు

  • అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు భారీగా నిధులు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

  • సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.6,641 కోట్లకు పెంచేందుకు అంగీకరించింది.

  • అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది.

  • శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • రాజధానిలో గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ–2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది.

విద్యుత్ ప్రాజెక్టులు

  • రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఏపీజెన్కోకు అనుమతి ఇచ్చింది.

  • మైలవరంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు 1,127 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

  • నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీకి అనుమతి ఇచ్చింది.

మొత్తంగా పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, అమరావతి నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.