ఆరుగోలనుపేటలో బారసాల కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధుల హాజరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేటలో సాధికార కమిటీ సభ్యులు రాయవరపు సీతారాములు మనవరాలి బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యులు కొప్పెర్ల నాగరాజు, ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొప్పాక వెంకటేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పాక వీర వెంకట సత్యనారాయణ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. దెందులూరు నియోజకవర్గ సాధికార కమిటీ అధ్యక్షుడు కొప్పాక వెంకటేశ్వరరావు కొండ, చాట్రాయి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాయవరం పుల్లారావు, దెందులూరు నియోజకవర్గ కార్యదర్శి కొక్కిరపాటి సురేష్, లింగపాలెం మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొప్పాక పాండు, నరం సత్యనారాయణతో పాటు పలువురు నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు, నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించి చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.