భూ రీసర్వే పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
పాటిమట్లలో 1,400 ఎకరాల్లో సర్వే పూర్తి.. మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచన
మోత్కూరు, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
245 సర్వే నంబర్లలో భూ సర్వే
గ్రామ పరిధిలోని 245 సర్వే నంబర్లలో మొత్తం 1,915 ఎకరాల భూమికి సంబంధించి రీసర్వే చేపట్టినట్లు అధికారులు అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటివరకు 1,400 ఎకరాల్లో సర్వే పనులు పూర్తయ్యాయని తెలిపారు.
పారదర్శకంగా సర్వే నిర్వహించాలి
మిగిలిన భూముల్లోనూ రీసర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పారదర్శకంగా పనులు నిర్వహించాలని సూచించారు.