నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
నారాయణపూర్
శ్రీవాణి–రవితేజ నిశ్చితార్థ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన రాచకొండ అంజయ్య–యాదమ్మ దంపతుల కుమార్తె శ్రీవాణికి, జనగాం గ్రామానికి చెందిన రవితేజతో బుధవారం వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. మండలంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సంస్థాన్ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహ్మద్ కాలేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీవాణి, రవితేజలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కందుల శ్రీను, ఆమనగంటి నరసింహ, ఐతరాజు కిరణ్, యాసరపు మహేష్, టేకుమట్ల సైదులు, రాజు తదితరులు పాల్గొన్నారు.