నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం
కంచర్ల నరేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా
వరంగల్ జిల్లా, నర్సంపేట, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): నర్సంపేట మున్సిపల్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కంచర్ల నరేష్ రెడ్డికి మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కమిషనర్‌కు శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణ అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి
అనంతరం చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ.. నూతన కమిషనర్ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు.
పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, మాదాసి రవి, బీరం భరత్ రెడ్డి, కొత్తకొండ మేఘన, శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.