BREAKING
thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
Test 4
Date of Publish : 04 November 2026, 08:27 pm
Posted by : KOLA MAHESH

పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 08:27 PM
4 వీక్షణలు

వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహణ.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం

బయ్యారం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు వెనిగళ్ల రవికుమార్, రేణుక దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని సమాజ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉన్న అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

వృద్ధులు, చిన్నారులకు అన్నదానం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి సేవ వృద్ధాశ్రమం, ఖమ్మంలోని అన్నం సేవ ఫౌండేషన్, మహబూబ్‌నగర్‌లోని టచ్ అనాథాశ్రమంలో వృద్ధులు, చిన్నారులకు భోజనాలు వడ్డించారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు.

చేతన ఫౌండేషన్ ద్వారా నిరంతర సేవలు

చేతన ఫౌండేషన్ ద్వారా కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగులకు సహాయం, పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ, మహిళలకు కుట్టుమిషన్ల అందజేత, నిరుపేదలకు వైద్య సహాయం వంటి కార్యక్రమాలతో ఫౌండేషన్ సమాజానికి సేవలు అందిస్తోందని ప్రశంసించారు.

వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకుని పలువురి ముఖాల్లో ఆనందం నింపిన వెనిగళ్ల రవికుమార్, రేణుక దంపతులకు ఆశ్రమాల నిర్వాహకులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.