BREAKING
thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
Test 4
Date of Publish : 04 November 2026, 08:25 pm
Posted by : KOLA MAHESH

గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 08:25 PM
12 వీక్షణలు

వివిధ గ్రామాల్లోని అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు.. వారసత్వ ఆశయాలను కొనసాగించాలని పిలుపు

మహబూబాబాద్ జిల్లా, గంగారం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): భారతదేశంలో పీడిత ప్రజలపై కొనసాగుతున్న దోపిడీ, పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి పూణెం ప్రభాకర్ అన్నారు.

నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారం మండల కేంద్రంతో పాటు కొడిసేలమెట్ట, పందెం, కోమట్లగూడెం, కాటినాగారం తదితర గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అమరవీరుల స్థూపాల వద్ద పార్టీ నాయకులు జెండాలు ఎగురవేసి నివాళులర్పించారు.

అమరుల ఆశయాలను కొనసాగించాలి

ఈ సందర్భంగా పూణెం ప్రభాకర్ మాట్లాడుతూ.. “భూమి, భుక్తి, దేశ విముక్తి” లక్ష్యంగా సాగిన దీర్ఘకాలిక విప్లవోద్యమంలో వేలాది మంది తమ జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం పోరాడారని పేర్కొన్నారు. వారు ఆశించిన దోపిడీ లేని వ్యవస్థ ఇంకా ఏర్పడలేదని, ఆ లక్ష్య సాధన కోసం నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ విధానాలపై విమర్శలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని సంపద, సహజ వనరులను స్థానిక ప్రజల ప్రయోజనాలకు వినియోగించకుండా పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని విమర్శిస్తూ, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని కోరారు.

నిరుద్యోగం, పేదరికం, వలసలు, ఆకలి చావులు వంటి సమస్యలు ఇప్పటికీ ప్రజలను వేధిస్తున్నాయని, పెట్టుబడిదారీ అనుకూల విధానాల వల్ల పేదల పరిస్థితి మరింత దిగజారుతోందని అన్నారు.

గ్రామాల్లో సభలు, సమావేశాలు

ఐక్య వర్గ పోరాటాల ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని సాధించేందుకు అమరవీరుల ఆశయాల బాటలో నడవాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. అమరవీరుల స్ఫూర్తితో గ్రామగ్రామాన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఈక బిక్షం, మండల నాయకులు కురుసం రంగయ్య, జోగ రాములు, కురుసం సురేష్, పూణ్యం రవికుమార్, నాగేశ్వరరావు, వీరస్వామి, వెంకన్న, అరుణ, లక్ష్మి, రామక్క తదితరులు పాల్గొన్నారు.