BREAKING
thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
Test 4
Date of Publish : 04 November 2026, 08:30 pm
Posted by : KOLA MAHESH

కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 08:30 PM
24 వీక్షణలు

బొంగులూరు ప్రమీదా కన్వెన్షన్ హాల్లో భారీగా హాజరైన కార్యకర్తలు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎంపీ చామల, ఎమ్మెల్యే మల్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 'రంగన్న ఆత్మీయ సమ్మేళనం' కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. బొంగులూరు క్రాస్‌రోడ్డు సమీపంలోని ప్రమీదా గార్డెన్స్‌లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సమ్మేళనానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అభిషేక్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డప్పులు, డోళ్లతో కార్యకర్తలు మల్‌రెడ్డికి స్వాగతం పలికారు.

కార్యకర్తల సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం

సమ్మేళనంలో మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు పలు సమస్యలను, తమ అభిప్రాయాలను ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చారు. నామినేటెడ్ పదవులు, కార్యకర్తలకు గుర్తింపు, ఇతర స్థానిక అంశాలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పలువురు నాయకులు ప్రస్తావించారు.

కార్యకర్తల కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ: ఎంపీ చామల

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆయన విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తల్లో కొంత నిరాశ ఉన్న విషయాన్ని పార్టీ గుర్తించిందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల అంశంపై ఎమ్మెల్యే మల్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావాలపై ఇప్పటి నుంచే ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

కార్యకర్తలే నా బలం, బలగం: మల్‌రెడ్డి

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలే తన బలం, బలగమని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వారి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. ప్రాధాన్యతను బట్టి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను క్షేత్రస్థాయిలో వాస్తవాలతో తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని, పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.

కార్యకర్తలతో సందడిగా కార్యక్రమం

ఈ ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా కార్యకర్తలు తరలిరావడంతో ప్రమీదా గార్డెన్స్ పరిసరాలు సందడిగా మారాయి. నాయకులతో ఫొటోలు దిగుతూ, సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలు ఉత్సాహంగా గడిపారు. సాయంత్రం వరకు కార్యక్రమం కొనసాగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.