BREAKING
thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
Test 4
Date of Publish : 04 November 2026, 08:26 pm
Posted by : KOLA MAHESH

ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 08:26 PM
14 వీక్షణలు

భువనగిరి డివిజన్‌లో నూతన ఏజెంట్ల నియామకం, కొత్త వ్యాపారంలో ప్రథమ స్థానం.. ఘనంగా సన్మానించిన ఉన్నతాధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో నూతన ఏజెంట్ల నియామకం, కొత్త వ్యాపారంలో భువనగిరి డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కరకాల సుదర్శన్‌ను ఇతర ఏజెంట్లు ఆదర్శంగా తీసుకోవాలని సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహు అన్నారు.

బుధవారం ఎల్‌ఐసీ ఉన్నతాధికారులతో కలిసి భువనగిరిలోని కరకాల సుదర్శన్ నివాసానికి వెళ్లిన ప్రభాత్ కుమార్ సాహు, ఆయనను పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

నియామకాలు, నూతన వ్యాపారంలో అగ్రస్థానం

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాత్ కుమార్ సాహు మాట్లాడుతూ.. చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కరకాల సుదర్శన్ నూతన ఏజెంట్ల నియామకంలో డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించారని తెలిపారు. అలాగే 'సన్మాన యాత్ర' పోటీలో అత్యధిక నూతన వ్యాపారం చేసి మొదటి స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. ఆయన కృషి, నాయకత్వం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

పాలసీదారుల సేవా కేంద్రం ప్రారంభం

అనంతరం సీఎల్ఐఏ మేనేజర్ స్వర్ణలత, భువనగిరి బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆర్. బలరాం, ఏఓ కేశవ్, ఏబీఎం సుధాకర్ రావు కలిసి కరకాల సుదర్శన్ నివాసంలో 'ఎల్‌ఐసీ పాలసీదారుల సేవా కేంద్రాన్ని' ప్రారంభించారు.

అచీవర్స్ ఫ్యామిలీ టీమ్ సభ్యులకు సన్మానం

కరకాల సుదర్శన్ నాయకత్వంలోని అచీవర్స్ ఫ్యామిలీ టీమ్‌కు చెందిన ఏజెంట్లు పొట్ట హేమలత జగన్, మీసాల లక్ష్మీ రాజయ్య, పులి అనిత సాయికుమార్‌తో పాటు ఇతర ఏజెంట్లను అతిథులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అచీవర్స్ ఫ్యామిలీ టీమ్ ఏజెంట్లు నిలుగొండ వెంకటరాజు, పులిజాల హేమలత, అర్థం రాధా, దోసపాటి మురళి, మద్దూరు జంగయ్య, పసల కరుణ, పెంటబోయిన పుష్ప, నాగరాజు, ఇతర ఏజెంట్లు, కాలనీవాసులు, ఎల్‌ఐసీ భువనగిరి బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.