BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 06:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో విత్తనాల దుకాణాలపై వ్యవసాయశాఖ తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Nov, 2026 - 06:38 PM
42 వీక్షణలు

రూ.28 లక్షల విలువైన 1,344 మొక్కజొన్న విత్తన ప్యాకెట్ల అమ్మకాలు నిలిపివేత

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయాధికారి టి. తిరుమలాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు విత్తన విక్రయ కేంద్రాలను పరిశీలించి విత్తనాల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, కంపెనీలకు సంబంధించిన ధ్రువపత్రాలు, కొనుగోలు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విత్తనాల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో ప్రతి ఒక్కరికీ విధిగా కొనుగోలు బిల్లు అందజేయాలని దుకాణ యజమానులకు స్పష్టం చేశారు. విక్రయించే ప్రతి రకం విత్తనానికి సంబంధించి కంపెనీ ధ్రువపత్రాలు, ఇన్వాయిస్‌లు, బిల్లులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విత్తనాల కొనుగోలు, విక్రయాల వివరాలను స్టాక్ రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా అవసరమైన కంపెనీ ధ్రువపత్రాలు, ఫారాలు చూపించని దుకాణాల్లో నిల్వ ఉన్న రూ.28 లక్షల విలువైన 1,344 మొక్కజొన్న విత్తన ప్యాకెట్ల విక్రయాలను అధికారులు తక్షణమే నిలిపివేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా వ్యవసాయశాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి విత్తనాల విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విస్సన్నపేట ఏడీఏ కె. శశికళ, ఏఓ జి. రాజ్యలక్ష్మి, ఏఈఓ ఉషారాణి, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.