BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 05:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను శివాలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 05:43 PM
20 వీక్షణలు

పెనుగొలను శివాలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ పార్వతి దేవి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీ పార్వతి దేవిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో ముస్తాబు చేసి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడంతో పాటు రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేశారు. వేద పండితులు ఇంద్రగంటి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి మంత్రాలను పారాయణం చేస్తూ చండీ హోమాన్ని భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.

హోమంలో ఆవు నెయ్యితో పాటు వివిధ రకాల హోమ ద్రవ్యాలు, పండ్లను సమర్పించారు. పలువురు దంపతులు హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు