BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నవంబర్ 26న ఏపీ సీఎం చంద్రబాబు రాక

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 01:13 PM
5 వీక్షణలు

ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి.. పకడ్బందీ భద్రతా ఏర్పాట్లకు ఆదేశాలు 

భద్రాద్రి కొత్తగూడెం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన రానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన పర్యటన షెడ్యూల్‌లో వెల్లడించింది. నవంబర్ 26న ఉదయం 7.50 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు 8 గంటల నుంచి 8.10 గంటల మధ్య ఉండవల్లి గ్రామంలోని 53/3 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతికి బయలుదేరుతారు. 10 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.30 నుంచి 4 గంటల వరకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జెడ్‌ ప్లస్ భద్రతతో పాటు ఎన్‌ఎస్‌జీ రక్షణ ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.