ఏపీ: NMMS స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీ వరకు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు.
NMMS పరీక్ష వచ్చే నెల 29వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది.
అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.