వరంగల్‌లో KUDA స్థలం కబ్జాకు యత్నం.. అధికారుల అడ్డుకట్ట
ఓ సిటీ కాలనీలో 80 ఫీట్ల రోడ్డుపై స్థలాన్ని చదును చేసి కంచెల ఏర్పాటు
వరంగల్ (ఎన్ టుడే న్యూస్): వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని ఓ సిటీ కాలనీలో KUDAకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఆదివారం సెలవు రోజును ఆసరాగా చేసుకుని 80 ఫీట్ల రోడ్డులోని స్థలాన్ని చదును చేసి, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టేందుకు చుట్టూ కంచెలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ విషయంపై సమాచారం అందుకున్న KUDA అధికారులు పోలీసులతో కలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థలాన్ని పరిశీలించి, కబ్జా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత వ్యక్తులను హెచ్చరించారు.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.