BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:26 pm
Posted by : KOLA MAHESH

కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం!

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 04:26 PM
22 వీక్షణలు

కొత్త చేయూత పింఛన్ల మంజూరులో ప్రభుత్వం మాట తప్పింది!

హామీలతో ఇంకెంతకాలం లబ్ధిదారులను మోసం చేస్తారు? అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి: ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్‌

యాదాద్రి భువనగిరి జిల్లా, నవంబర్‌ 2 (ఎన్‌ టుడే న్యూస్‌): కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఆ హామీని అమలు చేయకపోవడం శోచనీయమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్‌ విమర్శించారు.

ఎన్‌పీఆర్‌డీ రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం, కక్కిరేణి గ్రామాల్లో నిర్వహించిన సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇతర చేయూత పింఛన్‌దారులు ప్రభుత్వ ప్రకటనలపై ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం హామీలు ప్రకటించడానికే పరిమితమైందని, వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఇంకెంతకాలం చేయూత లబ్ధిదారులను మోసం చేస్తారని వనం ఉపేందర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు తక్షణమే కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేకించి వికలాంగులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలామందికి పింఛనే జీవనాధారంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. వెంటనే స్పందించకపోతే లబ్ధిదారులను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా కమిటీ సభ్యులు పిట్ట శ్రీనివాస్‌ రెడ్డి, నాగు నరసింహ, ఇంద్రపాలనగరం గ్రామ ఉపాధ్యక్షులు నూకల వెంకటేశం, కోశాధికారి గోగికారి నర్సోజి, పంది బాలమణి, పప్పు గణేష్‌, ఎడ్లకొండ నరసింహ, జోగుల వెంకటేశం, కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నబోయిన మంగమ్మ, కార్యదర్శులు రమాదేవి, కన్నెబోయిన సత్యనారాయణ, మాన్రా చంద్రయ్య, కన్నెబోయిన బిక్షం, బి. పద్మ, కన్నబోయిన చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.