BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 05:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎంపీ కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 05:37 PM
4 వీక్షణలు
  • తిరువూరులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎంపీ కేశినేని చిన్ని పర్యటన
  • ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు
  • ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం

ఎన్టీఆర్ జిల్లా (ఎన్‌ టుడే న్యూస్‌): తిరువూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నియోజకవర్గంలో పర్యటించి, ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

చీమలపాడులో కూటమి శ్రేణులతో సమావేశం

పర్యటనలో భాగంగా ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చేరుకున్న ఎంపీ కేశినేని శివనాథ్, మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను నేరుగా కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని సూచించారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థులకు అండగా ఉంటా

కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యమని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

తోటమూలలో ఎన్నికల వ్యూహాలపై చర్చ

అనంతరం గంపలగూడెం మండలం తోటమూల సెంటర్‌లోని ఎస్‌ఆర్ కల్యాణ మండపంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార ప్రణాళికలు, గ్రామాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కూటమి శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఎన్నికలను బాధ్యతగా తీసుకుని క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

తిరువూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి అవసరమైన కార్యాచరణపై ఎంపీ కేశినేని శివనాథ్ దృష్టి సారించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మండలాల వారీగా అభ్యర్థులు, నాయకులతో సమావేశమై ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.