BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Chatrai: ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 06:23 PM
11 వీక్షణలు

మూడు నక్షత్రాల గుర్తుపై ఓటేసి కలపాల జ్యోతిని గెలిపించండి ఎంపీటీసీ అభ్యర్థి కలపాల జ్యోతి

ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ లక్ష్యం మూడు నక్షత్రాల గుర్తుపై ఓటేసి కలపాల జ్యోతిని గెలిపించండి ఎంపీటీసీ అభ్యర్థి కలపాల జ్యోతి, వెంకటేశ్వరరావు విజ్ఞప్తి

Chatrai ఎన్ టుడే న్యూస్: నవంబర్ 2: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు సాగిస్తోందని పార్టీ నాయకులు కలపాల జ్యోతి, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా చిత్తపూరు గ్రామ ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కలపాల జ్యోతిని మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1969లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి దళితులు, ఆదివాసీలు, బడుగు, బలహీనవర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, శ్రమదోపిడీ నుంచి విముక్తి కోసం వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు సాగించిన పోరాటాల్లో పార్టీ క్రియాశీలకంగా పాల్గొందన్నారు. ప్రభుత్వ పోరంబోకు, బంజరు, కొండ పోరంబోకు, భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద ఉన్న భూములు కలిపి సుమారు పదివేల ఎకరాలకు పైగా పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించిందని వివరించారు. అసంఘటిత, నిర్మాణ రంగ కార్మికులు, గ్రామీణ వ్యవసాయ కార్మికులు, పేద రైతుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన హామీలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు 200 రోజుల పని కల్పించి రోజువారీ వేతనాన్ని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి పని కల్పించి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించాలని పేర్కొన్నారు. పేదలు నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు మూడు సెంట్ల స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని సబ్సిడీ రుణం మంజూరు చేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని కోరారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, భూముల రీసర్వేలో అనుభవదారుల పేర్లు నమోదు చేయాలని, ఇనాం భూములకు రైత్వారీ పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైక్రోఫైనాన్స్ సంస్థల వేధింపులను అరికట్టి వాటిపై కఠిన నియంత్రణలు విధించాలని, రైతులు, పేదలు, డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని తమ డిమాండ్లలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు అధిక నిధులు, అధికారాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. మండల, జిల్లా పరిషత్ సభ్యులకు గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలిపారు. ప్రతి మండలంలో ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అంగన్‌వాడీ కార్యకర్తలందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. చాట్రాయి మండల అభివృద్ధికి ప్రత్యేక డిమాండ్లు చాట్రాయి మండలాన్ని పూర్తిస్థాయి కరువు మండలంగా ప్రకటించాలని, జలజీవన్ పథకం ద్వారా గ్రామ ప్రజలకు నిరంతరం పరిశుభ్రమైన తాగునీరు అందించాలని కోరారు. గ్రామంలోని అన్ని రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని, అన్ని సామాజిక వర్గాలకు స్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పడమటి దళితవాడకు సంబంధించిన వాగు భూమి వర్గీకరణను మార్చి నివాసితులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పశువైద్యశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం ఎన్నికలకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన పోరాడతామని కలపాల జ్యోతి, వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం, కార్మికుల హక్కుల సాధన కోసం తమ పార్టీ అభ్యర్థికి మద్దతు పలకాలని, మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి కలపాల జ్యోతిని గెలిపించాలని చిత్తపూరు గ్రామ ప్రజలను కోరారు.