నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం
సచివాలయాలు, మన మిత్ర వాట్సాప్ ద్వారా సేవలు
ఎన్ టుడే న్యూస్: ఏలూరు జిల్లా: దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ‘మన మిత్ర’ వాట్సాప్, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా దివ్యాంగులు స్లాట్లు నమోదు చేసుకోవచ్చు. మొత్తం 21 రకాల వైకల్యాలకు సంబంధించి వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు. యాసిడ్ దాడి బాధితులు, అభ్యాస వైకల్యం ఉన్నవారు, ఆటిజంతో బాధపడుతున్నవారు, బహుళ వైకల్యాలు ఉన్నవారు తదితర కేటగిరీలకు ప్రత్యేకంగా స్లాట్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ కోసం వెళ్లే దివ్యాంగులు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లాలి. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సదరం ధ్రువపత్రాల కోసం ముందస్తుగా స్లాట్ నమోదు చేసుకోవాలని సూచించారు. మన మిత్ర వాట్సాప్ నంబర్: 9552300009