వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా దూలం నాగేశ్వరరావు పర్యటన
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా డీఎన్‌ఆర్ ఎన్నికల ప్రచారం
- కైకలూరు మండలంలో గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసిన దూలం నాగేశ్వరరావు
కైకలూరు, ఏలూరు జిల్లా (ఎన్ టుడే న్యూస్): ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) కైకలూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కైకలూరు మండల జెడ్పీటీసీ అభ్యర్థి జయమంగళ కాసులు విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కైకలూరు మండలం దొడ్డిపట్ల–రామవరం సెగ్మెంట్ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి గూట్ల యోహానుతో కలిసి డీఎన్‌ఆర్ గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థి గూట్ల యోహానును అఖండ మెజారిటీతో గెలిపించాలని డీఎన్‌ఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.