BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 05:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బండి సంజయ్‌కు చేదు వార్త.. నితిన్ నబీన్ పర్యటన రద్దు

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 05:30 PM
7 వీక్షణలు
  • బండి సంజయ్‌ మహా పాదయాత్రకు నితిన్‌ నబీన్‌ డుమ్మా!
  • నవంబర్‌ 5న జరగాల్సిన కరీంనగర్‌ పర్యటన వాయిదా..
  • దీపావళి తర్వాత కొత్త షెడ్యూల్‌

కరీంనగర్‌ (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపిన బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 5న కరీంనగర్‌లో జరగాల్సిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పర్యటన వాయిదా పడింది.

ముందుగా ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం నితిన్‌ నబీన్‌ కరీంనగర్‌లో గాంధీ విగ్రహం నుంచి కమాన్‌ వరకు జరిగే పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆయన పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. దీపావళి తర్వాత కరీంనగర్‌లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బండి సంజయ్‌ సుమారు 50 వేల మందితో భారీ జనసమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాదయాత్ర ఏర్పాట్లపై ఇప్పటికే పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

నితిన్‌ నబీన్‌ పర్యటన వాయిదా పడటంతో పాదయాత్ర నిర్వహణ, తదుపరి షెడ్యూల్‌పై ఆసక్తి నెలకొంది. అయితే పాదయాత్ర కార్యక్రమం రద్దయిందా, లేక నిర్ణీత ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.