BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పైపుల లీకేజీతో రోడ్లన్నీ జలమయం తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకోని అధికారులు సీతానగరం కాలనీలో గ్రామస్తుల ఇబ్బందులు.. అధికారుల తీరుపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 04:20 PM
20 వీక్షణలు

 ఏలూరు జిల్లా, చింతలపూడి: ఒకవైపు తాగునీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలని అధికారులు సూచిస్తుంటే, మరోవైపు చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలోని కాలనీలో మాత్రం విలువైన తాగునీరు వృథాగా రోడ్లపై పారుతోంది. పైపుల లీకేజీల కారణంగా కాలనీలోని రహదారులన్నీ నీటితో నిండిపోతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా పైపుల నుంచి నీరు బయటకు లీకవుతూ రోడ్లపై ప్రవహిస్తున్నా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాలనీవాసులు నిత్యం అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. ఒకవైపు తాగునీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ నీటిని వృథా చేయవద్దని చెబుతున్న అధికారులు, మరోవైపు పైపుల లీకేజీల ద్వారా వందల లీటర్ల నీరు వృథా అవుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు ఇలా రోడ్లపాలవుతుండటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీతానగరం కాలనీలోని పైపుల లీకేజీలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టి, రహదారులపై నీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.