BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురసు తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్ భారీ నుంచి అతిభారీ వర్షాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 05:18 PM
11 వీక్షణలు
  • పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

తెలంగాణ (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ రాష్ట్రంలో మురసు తుఫాన్‌ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు సమాచారం.

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగామ, సంగారెడ్డి, మెదక్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌–మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.