BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 05:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలీసులమంటూ బెదిరించి రూ.15 లక్షల దోపిడీ సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 05:22 PM
9 వీక్షణలు

డబ్బు ఎక్కడ దాచారో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ కావాల్సిందే

ఎన్ టుడే న్యూస్ గుంటూరు జిల్లా: మంగళగిరి ప్రాంతంలో సంచలనం సృష్టించిన రూ.15 లక్షల దోపిడీ కేసును మంగళగిరి రూరల్ పోలీసులు వేగంగా ఛేదించారు. తాము పోలీసులమంటూ ఓ వ్యాపారిని బెదిరించి, భారీ మొత్తంలో నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను దోచుకెళ్లిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరులో పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తి కంపెనీకి చెందిన రూ.15 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని బైక్‌పై విజయవాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో షేక్ జానీ, షేక్ సురాజ్, షేక్ నాగూర్ అనే ముగ్గురు వ్యక్తులు అతడిని అడ్డగించారు. తాము పోలీసులమని చెప్పి రఫీని తీవ్రంగా బెదిరించారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.15 లక్షల నగదు బ్యాగుతో పాటు మూడు సెల్‌ఫోన్లను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఊహించని ఘటనతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంతో పాటు ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కెమెరాల్లో లభించిన ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. అయితే దోపిడీకి పాల్పడిన నిందితులు పోలీసులమంటూ ఎలా బెదిరించారు, దోచుకున్న నగదును ఎక్కడ దాచారు, ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.