BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 05:16 PM
2 వీక్షణలు

మధిరలో 50 మందికి పైగా రక్తదానం.. రోగులకు పండ్ల పంపిణీ

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మందికి పైగా సభ్యులు రక్తదానం చేయగా, ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవి, వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఎస్. నాగేశ్వరరావు, వాసిరెడ్డి బెనర్జీ, మోదుగు బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ శాంతి సేన కన్వీనర్ మొగిలి శ్రీను మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన రోగులకు ఉపయోగపడేలా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. గాంధీ జయంతిని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పోరాడుతూ ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను అభినందించారు.

రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు మరింత మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని మొగిలి శ్రీను పిలుపునిచ్చారు.