BREAKING
thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ
Test 4
Date of Publish : 16 November 2026, 07:48 pm
Posted by : K MAHESH

పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 07:48 PM
5 వీక్షణలు

బాలల ప్రజావాణిలో చిన్నారుల నుంచి వినతుల స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

జిల్లాలో పిల్లల హక్కుల పరిరక్షణతో పాటు, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పిల్లల కోసం నిర్వహించిన బాలల ప్రజావాణిలో ఆయన చిన్నారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిల్లలు తమ వ్యక్తిగత, సామాజిక అవసరాలు, విద్యా సదుపాయాలకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన పసునాది బాబు గత ఏడాది అనారోగ్యంతో మరణించగా, ఆయన భార్య మౌనిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి తొమ్మిదేళ్ల కుమార్తె విద్యశ్రీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య పథకం ద్వారా స్పాన్సర్‌షిప్ అందించి ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు.

అదే మండలం బొల్లేపల్లికి చెందిన ఈర్లపల్లి రాకేష్, రిషి ప్రభుత్వ పాఠశాలలో వరుసగా 9, 5వ తరగతులు చదువుతున్నారు. గత ఏడాది వారి తల్లి మరణించడంతో మిషన్ వాత్సల్య పథకం ద్వారా సహాయం అందించాలని కోరారు.

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన డోర్నాల జాహ్నవి తల్లిదండ్రులు 18 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన సోదరుడితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. చేనేత కార్మికుడైన ఆమె తండ్రికి ఎల్‌ఐసీ ద్వారా రూ.5 లక్షల బీమా పరిహారం వచ్చినట్లు వినతిలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్న నేపథ్యంలో జాహ్నవికి మేనత్తను సంరక్షకురాలిగా నియమించేందుకు గార్డియన్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు.

యాదగిరిగుట్ట మండలం చొల్లేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు మంజూరు చేయాలని విద్యార్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన విష్ణుప్రియ పాఠశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా, పాటిమట్ల గ్రామానికి చెందిన కీర్తన పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎర్ర శివరాజ్, బీఆర్‌బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, చైల్డ్‌లైన్ ప్రతినిధి దశరథ, జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు శ్రీశైలం, క్రిస్టోఫర్, స్కోప్ సంస్థ బాధ్యుడు సోమ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.