BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగ్గయ్యపేటలో డిక్కీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. రూ.4.62 లక్షల నగదు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 08:04 PM
7 వీక్షణలు

 సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్.. అంతర్రాష్ట్ర దొంగతనాల్లోనూ నిందితులకు అనుభవం

ఎన్టీఆర్ జిల్లా – జగ్గయ్యపేట: వాహనం డిక్కీలో ఉంచిన భారీ నగదును అపహరించిన కేసును జగ్గయ్యపేట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఛేదించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన పూర్తి నగదు రూ.4,62,590ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల అక్టోబర్ 30వ తేదీన జగ్గయ్యపేటలోని చిల్లకల్లు రోడ్డులో ఈ చోరీ జరిగింది. బాధితుడు తన స్కూటర్ సీటు కింద ఉన్న డిక్కీలో రూ.4,62,590 నగదును ఉంచగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆ మొత్తాన్ని అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన మొత్తం రూ.4,62,590 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడెం మండలం, ఊటై గ్రామానికి చెందిన మేకల ప్రకాష్ (37)గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడు మేకల రాజేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. విచారణలో నిందితులు మహారాష్ట్రలోనూ ఇదే తరహా దొంగతనాలకు పాల్పడినట్లు, గతంలో పలుమార్లు అరెస్టయి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. భారీ మొత్తంలో నగదును తీసుకెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల డిక్కీల్లో నగదును నిర్లక్ష్యంగా ఉంచరాదని సూచించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకుల పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని కోరారు. కేసును వేగంగా ఛేదించి, చోరీకి గురైన నగదులో వందశాతం రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐ జి. రాజు, పెనుగంచిప్రోలు ఎస్‌ఐ ఎం.ఎస్.కె. అర్జున్‌తో పాటు పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు.