BREAKING
thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం
Test 4
Date of Publish : 16 November 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 07:04 PM
30 వీక్షణలు

అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ చట్టం కింద కేసులు

రేషన్ బియ్యాన్ని బయట వ్యక్తులకు విక్రయిస్తే కార్డులు రద్దు త్వరలో ప్రతి మండల కేంద్రంలో ధరణి కేంద్రాలు ఏలూరు, నవంబర్ 16: జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్ హెచ్చరించారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోమవారం ఏలూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా అక్రమ రవాణా జరిగినట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశామని, బియ్యం నిల్వలు, రికార్డులను పరిశీలించగా ఎలాంటి వ్యత్యాసాలు గుర్తించలేదని వివరించారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కార్డుదారులు ఇతరులకు విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని బాబు విలియమ్స్ స్పష్టం చేశారు. ఎవరైనా తమకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మినట్లు గుర్తిస్తే సంబంధిత రేషన్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నందున కార్డుదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ విక్రయాలు, నల్లబజారు తరలింపుపై ఫిర్యాదులు అందడంతో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మరోవైపు పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం రాయితీపై సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో తొమ్మిది ధరణి కేంద్రాల ద్వారా బీపీటీ సన్నబియ్యాన్ని రాయితీ ధరకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సేవలను మరింత విస్తరించి త్వరలో ప్రతి మండల కేంద్రంలోనూ ధరణి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సన్నబియ్యం అందించడమే లక్ష్యమని జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్ పేర్కొన్నారు.