BREAKING
thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
Test 4
Date of Publish : 16 November 2026, 06:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో UDID నిర్లక్ష్యం.. 18 నెలలుగా దివ్యాంగుల ఎదురుచూపులు!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 06:35 PM
19 వీక్షణలు

తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో UDID కార్డుల దరఖాస్తులకు మోక్షమెప్పుడు 18 నెలలుగా పరిశీలనకు నోచుకోని దివ్యాంగుల దరఖాస్తులు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదంటున్న బాధితులు చూస్తాం.. చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ (UDID) కార్డులను జారీ చేస్తోంది. దివ్యాంగులందరికీ ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొన్ని ఆసుపత్రులను గుర్తించి దరఖాస్తుల పరిశీలన, వైకల్య నిర్ధారణ వంటి బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలో తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా UDID కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో UDID కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటిని పరిశీలించకుండా సుమారు ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉంచుతున్నారని బాధితులు వాపోతున్నారు. పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి సంబంధిత సిబ్బందిని సంప్రదించినా స్పష్టమైన సమాధానం లభించడం లేదని చెబుతున్నారు. ప్రతిసారీ పరిశీలిస్తాం, చేస్తాం అంటూ చెబుతున్నారే తప్ప దరఖాస్తులపై ఎలాంటి ముందడుగు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వ గుర్తింపు కార్డు పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నెలలు గడుస్తున్నా దరఖాస్తుల పరిశీలన జరగకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. UDID కార్డు లేకపోవడం వల్ల దానికి అనుసంధానమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ ప్రయోజనాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెండింగ్‌లో ఉన్న UDID దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని దివ్యాంగులు కోరుతున్నారు. దరఖాస్తుల జాప్యానికి గల కారణాలను వెల్లడించి, కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 18 నెలలుగా ఎదురుచూస్తున్న తమ సమస్యకు అధికారులు ఇప్పటికైనా పరిష్కారం చూపాలని ఆశిస్తున్నారు.