BREAKING
thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి
Test 4
Date of Publish : 16 November 2026, 06:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 06:59 PM
25 వీక్షణలు

 గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులకు ఘన నివాళులు 

చాట్రాయి: నవంబర్ 16: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త ఈ.వి. శ్రీనివాస్, ఎంపీపీఎస్ మెయిన్ పాఠశాల ఉపాధ్యాయులు ఎం. రవికుమార్, చనుబండ గ్రామ రెవెన్యూ అధికారి పి. శోభన్ బాబు, గ్రామ సచివాలయ డిజిటల్ సహాయకుడు కె. కోటేశ్వరరావు, పంచాయతీ గుమస్తా టి. సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పితామహులుగా గుర్తింపు పొందిన అయ్యంకి వెంకట రమణయ్య, డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖుల పాత్ర, సమాజంలో గ్రంథాలయాల ప్రాధాన్యత, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాల్సిన అవసరంపై అతిథులు ప్రసంగించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని వివరించారు. అనంతరం ఎంపీపీఎస్ మెయిన్, ఎంపీపీఎస్ కే. చనుబండ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు పద్యాల పఠనం, నీతి కథలు చెప్పడం వంటి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని చనుబండ శాఖా గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ సమన్వయంతో నిర్వహించారు.