అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ముందా??? జగన్ మోహన్ రెడ్డి
టీడీపీ పుంగనూరు నాయకుడు మధుసూదన్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
పి పి పి లపై నిన్న ysrcp పార్టీ వాళ్ళు రాద్దాంతం చేయడం జరగింది. ఈ పి పి పి ల వలన భవనాలు త్వరగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, కోటి సంతకాల సేకరణ కోసం విద్యావంతులను కానీ, విద్యార్థులను కానీ సంప్రదించి సంతకాలు చేపించారా?? అని టీడీపీ పుంగనూరు నాయకుడు మధుసూదన్ రాయల్ ప్రశ్నించారు. మీరు ప్రజలని ఎంత మభ్యపెట్టినా, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరని అన్నారు. 11 మంది శాసనసభ్యులు ఉన్న మీరు ఏనాడు అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రశ్నించలేదని, ముందు అసెంబ్లీ కి వెళ్లి తర్వాత ప్రజల్లోకి (రోడ్లపైకి) వస్తే బాగుంటుందని అన్నారు. 90 పైసలకే ఎకరం భూమిని ఇస్తున్నారని అంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం భూమిని ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. మీలాగా కోట్లకు కోట్లు వసూలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి కోసం అమరావతి రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూమిని ఇవ్వడం చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం తోనే సాధ్యం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయనకు తోడు ఉన్నంతకాలం మిమ్మల్ని ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలియజేస్తున్నానని మధుసూదన్ రాయల్ తెలిపారు.














