పుంగనూరుకు చెందిన మణికంఠ కామాటం కెరీర్ గైడెన్స్
పుంగనూరుకు చెందిన మణికంఠ కామాటం కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్‌గా నియామకం...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
సర్వశిక్షా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పుంగనూరుకు చెందిన మణికంఠ కామాటం జిల్లా కెరీర్ గైడెన్స్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్‌గా నియమితులయ్యారు.
పదో తరగతి అనంతరం విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, వృత్తి విద్య, సాంకేతిక విద్య వంటి వివిధ విద్యా మార్గాలను ఎంచుకోవడంపై ఆయన అవగాహన కల్పించనున్నారు. అలాగే వివిధ పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ మార్గాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు.
విద్యార్థుల్లో చదువుపై ఒత్తిడి, పరీక్షల భయం, భవిష్యత్తుపై ఆందోళన, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై కూడా కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విధానాలను తెలియజేయనున్నారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మాత్రమే కాకుండా విద్యా సంస్థలు కూడా కెరీర్ గైడెన్స్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్‌కు సంబంధించిన సమాచారం కోసం సంప్రదించవచ్చు. సెలవు రోజుల్లో విద్యార్థులకు ఉచిత కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అందుబాటులో ఉంటుందని మణికంఠ కామాటం తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9581432310