అమరావతిలో సీఎం చంద్రబాబు–తమిళనాడు సీఎం విజయ్ భేటీ
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.
తన నివాసానికి వచ్చిన సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను సీఎం విజయ్‌కు చంద్రబాబు పరిచయం చేశారు. సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు, పరస్పర సహకార అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.